మున్సిపాలిటీకి పన్ను చెల్లించలేదని షాప్​లు సీజ్

మున్సిపాలిటీకి పన్ను చెల్లించలేదని షాప్​లు సీజ్

మెదక్​ టౌన్​, వెలుగు : మున్సిపాలిటీకి 20 ఏళ్లుగా పన్ను చెల్లించలేదని ఆలయానికి సంబంధించిన షాప్​లను అధికారులు సీజ్​చేశారు. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయానికి సంబంధించిన షాప్​ల నిర్వాహకులు 2004  నుంచి ఇప్పటి వరకురూ.15 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. 

దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం మునిసిపల్​ సిబ్బంది షాప్​లను సీజ్ చేశారు. ఈ క్రమంలో షాప్​ల నిర్వాహకులు తాము అద్దె చెల్లించినప్పటికీ ఇలా చేయడం పద్దతి కాదని మున్సిపల్​ సిబ్బందితో గొడవకు దిగారు.