చెరువు కబ్జా చేసి కట్టిన SR రెసిడెన్షియల్ కాలేజ్ సీజ్ చేసిన అధికారులు

చెరువు కబ్జా చేసి కట్టిన SR రెసిడెన్షియల్ కాలేజ్ సీజ్ చేసిన అధికారులు

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని SR రెసిడెన్షియల్ క్యాంపస్ కబ్జా వ్యవహారం హైడ్రా దృష్టికి వచ్చింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాం పేట్ రోడ్డు హిల్ కౌంటి ఎదురుగా ఉన్న పత్తికుంట చెరువులోకి వరద నీరు భారీగా చేరింది. దాదాపు పది ఎకరాల్లో  విస్తరించి ఉన్న పత్తికుంట చెరువు చాలా భాగం కబ్జాలకు గురైంది. 

Also Read:-మరో 28 రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

చెరువులో నాలుగు ఎకరాలు ఆక్రమించి SR రెసిడెన్షియల్ కాలేజ్ నిర్మించారని పిర్యాదులు వచ్చాయి. విషయం తెలుసుకుని పూర్తి ఆధారాలతో SR రెసిడెన్షియల్ కాలేజ్‌ను సీజ్ కార్పొరేషన్ అధికారులు మూసి వేశారు. వరదల కారణంగా SR కాలేజ్ సెల్లార్ లోకి వరద నీరు వచ్చింది. క్యాంపస్ లో 500 మంది విద్యార్థుల దాకా ఉన్నారు. వర్షాల కారణంగా సెలవులు అంటూ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులును బయటకు పంపింది.