నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు తప్పవు

కమలాపూర్/ నల్లబెల్లి /  నర్సంపేట/ కొత్తగూడ, వెలుగు : నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. శనివారం ఉమ్మడి వరంగల్​జిల్లాలోని పలు ఫర్టిలైజర్​దుకాణాల్లో పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్​ మండల కేంద్రంలో ఇన్​స్పెక్టర్​హరికృష్ణ, మర్రిపల్లిగూడెం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ వర్మ, వరంగల్​జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో రూరల్​సీఐ రాజగోపల్

నర్సంపేట టౌన్​లో ​సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విత్తన విక్రయ షాప్​లను తనిఖీ చేశారు. మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మహబూబాబాద్ ఏడీఏ లక్ష్మినారాయణ, ఏవో ఉదయ్​తో కలిసి దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణదారులు విత్తన నిల్వల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. రసీదులను రైతులకు కచ్చితంగా ఇవ్వాలని సూచించారు.