
వనపర్తి, వెలుగు: ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి చనిపోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పౌల్ట్రీ ఫారాలను పశు సంవర్ధక శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్కడా బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని తెలిపారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో తనిఖీలు నిర్వహించేందుకు 48 టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. రోజూ ఒక్కో టీమ్ తమకు కేటాయించిన కోళ్ల ఫారాలను పరిశీలించి నివేదికను అందజేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రజలు భయడాల్సిన అవసరం లేదన్నారు.