నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల ఏజెన్సీలోని మైలారం గుట్టపై జరుగుతున్న మైనింగ్ ప్రాంతాన్ని ఫారెస్ట్, మైనింగ్ అధికారులు బుధవారం పరిశీలించారు. బుధవారం ‘మైలారంలో మైనింగ్ చిచ్చు’ హెడ్డింగ్‌తో పబ్లిష్ అయింది. దీనిపై స్పందించిన సీసీఎఫ్ డీఎఫ్‌వో రోహిత్, రేంజ్ ఆఫీసర్ ఈశ్వర్‌ను సర్వే చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు డీఆర్‌వో రేణుక, బీట్ ఆఫీసర్లు, జిల్లా మైనింగ్ ఇన్స్పెక్టర్ నాగచైతన్య తదితరులు మైలారం గుట్టపై మైనింగ్ప్రాంతాన్ని, గ్రామాన్నీ పరిశీలించారు. మైనింగ్ఏరియా హద్దులను పరిశీలించారు. ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్‌లో పొందుపరిచిన నిబంధనలు పరిశీలించారు. ఫారెస్ట్ ఆఫీసర్ ఈశ్వర్ మాట్లాడుతూ సర్వే రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
ఎకో సెన్సిటివ్ జోన్పరిధిపై సందిగ్ధం
కాగా పులుల అభయారణ్యం సరిహద్దుల్లో ఎకో సెన్సిటివ్ జోన్ఎంత మేరకు ఉండాలనే దానిపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్, ఏపీలోని కర్నూల్, గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని టైగర్రిజర్వ్జోన్నుంచి ఎకో సెన్సిటివ్‌జోన్ ఎంత దూరంలో ఉండాలనే దానిపై నాలుగు జిల్లాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఎకోసెన్సిటివ్ జోన్పరిధిని గుర్తించలేదు.
ఈనేపథ్యంలో 2023లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం టైగర్ రిజర్వ్ ఏరియా నుంచి 5 కి.మీల నుంచి 10 కి.మీల పరిధి వరకు ఎకో సెన్సిటివ్ జోన్‌గానే పరిగణించాలనే ఆదేశాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని ప్లెయిన్ ఏరియాలు, ఆవాసాలు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి వస్తున్నా నిబంధనలకు లోబడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని తెలంగాణ ఫారెస్ట్ యాక్టు, వైల్డ్‌లైఫ్ యాక్ట్‌లో స్పష్టంగా ఉంది. ఫారెస్ట్ పరిధిలో చేపట్టే పనులకు ఆయా శాఖల అనుమతి తీసుకోవాలని ఈ చట్టంలో ఉంది.
ఈ జోన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. కాగా వివాదస్పదంగా మారిన మైలారం గుట్ట అమ్రాబాద్ టైగర్‌రిజర్వ్ ఏరియా నుంచి 5 కి.మీల పరిధిలోపలే ఉండటం గమనార్హం. మరోవైపు ఆరేండ్ల పోరాటాల తర్వాత మొదటిసారి తమ ఊరికి ఉన్నతాధికారులు వచ్చి సర్వే నిర్వహించారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైలారం గుట్ట మైనింగ్ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదని ఎన్జీటీలో తాడో పేడో తేల్చుకుంటామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.