ఆయుష్మాన్​​ ఆసుపత్రుల్లోఫేషియల్​ అటెండెన్స్

ఆయుష్మాన్​​ ఆసుపత్రుల్లోఫేషియల్​ అటెండెన్స్
  • ట్యాబ్​లు అందజేసిన సర్కార్​

భద్రాచలం, వెలుగు : జిల్లాలో ఆయుష్మాన్​ ఆధ్వర్యంలో ఉన్న హోమియో,ఆయుర్వేద ఆసుపత్రుల్లో సిబ్బందికి ఫేషియల్​ రికగ్నైజేషన్​అటెండెన్స్​ను  అధికారులు ప్రవేశపెట్టారు. ఉదయం 9 గంటలకు ఒకసారి, సాయంత్రం 4 గంటలకు డ్యూటీ అయిపోయాక రెండో సారి ఈ అటెండెన్స్ ఉంటుంది. పావుగంట గ్రేస్​ టైం కేటాయించారు. ఆ తర్వాత వచ్చిన వారికి ఆబ్సెంట్​ పడుతుంది.

పనిచేసే చోట ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి స్టాఫ్​ వస్తున్నారని, డ్యూటీకి రాకుండా వచ్చిన రోజే అన్ని రోజుల సంతకాలు పెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఆయుస్మాన్​ ఈ ఫేషియల్​ అటెండెన్స్ కు శ్రీకారం చుట్టింది.


భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 13 డైరక్ట్ ఆసుపత్రులు, ఎన్​ఆర్​హెచ్​ఎం( నేషనల్ రూరల్​ హెల్త్ మిషన్​) ద్వారా ఆయా పీహెచ్​సీల్లో నడిచే 17 ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుతం 13 ఆసుపత్రుల్లోనే ఈ విధానం అమలు చేస్తున్నారు. తర్వాత మిగిలిన 17 ఆసుపత్రుల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం వరంగల్​లోని ఆయుస్మాన్​ విభాగం రీజనల్​ డిప్యూటీ డైరక్టర్​ కార్యాలయంలో డాక్టర్లకు ఈ ఏడాది మార్చి నెలలో రెండు రోజుల ట్రైనింగ్​ ఇచ్చి ట్యాబ్​లను అందజేశారు. 

ఆన్​లైన్​లో  పేషెంట్ల వివరాలు

పేషెంట్ల వివరాలను రోజూ ట్యాబుల్లో పొందుపరుస్తున్నారు. పేషెంట్​ రిజిస్ట్రేషన్​లో భాగంగా ఆధార్​ నెంబర్​,మొబైల్​ నెంబర్​,  అడ్రస్​, వ్యాధి, రక్తపరీక్షల వివరాలు నమోదు చేస్తున్నారు.   మెడిసిన్స్ కూడా నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్​ నెంబర్​ ద్వారా తర్వాత మళ్లీ ట్రీట్మెంట్​ సమయంలో ఇవన్నీ పరిశీలించడం డాక్టర్లకు ఈజీ అవుతుంది.

యూనిక్​ నెంబర్​ కొడితే పేషెంట్​ పూర్తి వివరాలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఏ రోజుకారోజు హెడ్​ఆఫీస్​కు చేరుతాయి. రోజువారీ ఓపీ, స్టాఫ్​ అటెండెన్స్ నేరుగా హెడ్​ఆఫీసు నుంచి సూపర్​వైజ్​ చేస్తారు.  ఈ విధానం విధులకు డుమ్మా  కొట్టే స్టాఫ్​కు చెక్​ పెడుతుంది. 

ప్రయోగాత్మకంగా అమలు

ఫేస్​  రికగ్నైజేషన్​ ద్వారా ఆయుస్మాన్​ విభాగంలో పనిచేసే స్టాఫ్​ ఫేషియల్​ అటెండెన్స్ తీసుకోవడాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పారదర్శకత కోసం దీన్ని ప్రవేశపెట్టారు. ప్రతీ రోజూ స్టాఫ్​ అటెండెన్స్ తో పాటు, పేషెంట్ల వివరాలు, వారికి అందించే వైద్యం అన్నీ హెడ్డాఫీసుకు చేరుతాయి. ఎన్​ఆర్​హెచ్​ఎం ద్వారా నడిచే ఆయుస్మాన్​ ఆసుపత్రుల్లో కూడా త్వరలో అమలు చేసే అవకాశం ఉంది.    - డా.వెంకటేశ్వర్లు,   హోమియోపతి వైద్యశాల,భద్రాచలం