వర్షంపై డప్పు సాటింపు

 వర్షంపై డప్పు సాటింపు

యాదాద్రి భువనగిరి: రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే..నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతు న్నాయి..కొన్నిచోట్ల చెరువులు తెగిపోయాయి..కొన్నిచోట్ల మత్తడి దుంకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించి పో యింది. రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులు నిండు కుండలా తలపిస్తున్నాయి.  అయితే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం  అలెర్ట్ అయింది.. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. అయితే భువనగిరి జిల్లా రామన్న పేటలో భారీ వర్షాలపై వినూత్న రీతిలో  అలెర్ట్ చేశారు అక్కడి గ్రామ సర్పంచ్.. 

ALSO READ | సాగర్ ఎడమ కాల్వకు గండి.. తీవ్ర భయాందోళనలో ప్రజలు

రానున్న మూడు రోజుల వర్షాలు ఉన్నందున్న రామన్నపేటలో డప్పు సాటింపు ద్వారా అలెర్ట్ చేశారు స్థానిక అధికారులు, గ్రామ సర్పంచ్.. పాత బడిన ఇండ్లలో ఉండకూడదని హెచ్చరించారు. కరెంట్ పోల్స్ దగ్గరకు వెళ్లొదని.. గ్రామంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా.. ఏదైనా ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంటే వెంటనే గ్రామ పంచాయతీ, అధికారులకు తెలియజేయాలని డప్పు సాటింపు ద్వారా రామన్న పేట గ్రామ ప్రజలను అలెర్ట్ చేశారు.