జూరాల 5 గేట్లు ఓపెన్

జూరాల 5 గేట్లు ఓపెన్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఇన్​ఫ్లో 74 వేల క్యూసెక్కులుగా ఉండడంతో అధికారులు సోమవారం ప్రాజెక్టు వద్ద ఐదు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. 

317.980 మీటర్ల లెవల్ లో నీటిని నిల్వ ఉంచుకొని గేట్ల ద్వారా 20,320 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 36,476 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 1,500 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–1కు 650 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్​కు 730 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 60,079 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం కుడిగట్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్

శ్రీశైలం: శ్రీశైలం జలశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఏపీలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సోమవారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇన్ ఫ్లో 56,801 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4,945 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 862.20 అడుగుల మేర నీరు ఉంది.