కోహెడ(హుస్నాబాద్)వెలుగు : మండలం లో జరిగే సింగరాయ జాతరపై కూరెల్ల, తంగళ్లపల్లి గ్రామస్తుల మధ్య కొంత కాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ నెల 29న జరిగే జాతరపై మంగళవారం హుస్నాబాద్ఆర్డీవో ఆఫీస్లో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరిహద్దు వివాదం ఉండడంతో ఈ సంవత్సరం రెవెన్యూ, పోలీస్ ఆధ్వర్యంలో జాతరను నిర్వహిస్తామని చెప్పారు.
ఇందుకు ఇరు గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. జాతర అనంతరం సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సతీశ్, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్సురేఖ, ఎస్ఐ అభిలాష్ఉన్నారు.