- సివిల్ సప్లై అధికారుల దాడులు
కురవి, వెలుగు: మండల పరిధిలోని మొగిలిచర్ల నవ్య ఇండ్రస్టీస్ రైస్ మిల్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 2022-23లో వానకాలం పంటకు సంబంధించిన 53వేల 560 క్వింటాల ధాన్యాన్ని మిల్లింగ్‌కు ఇచ్చారు. 36వేల 420క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై కు అందించాల్సి ఉండగా, కేవలం 8871 క్వింటాల బియ్యాన్ని మాత్రమే అందించారు. 40,500 వందల క్వింటాల ధ్యానం ఉండాల్సి ఉండగా, కేవలం 15 వేల క్వింటాల ధ్యానం మాత్రమే ఉన్నట్లు తెలిపారు.
రూ.8.36 కోట్ల 94 వేల బియ్యం మాయంకావడంతో ఆ మిల్ యాజమానిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారి ప్రభాకర్, సివిల్ సప్లై జిల్లా అధికారి కృష్ణవేణి, అధికారులు పాల్గొన్నారు.
కనకపర్తిలో రెండు రైస్‌మిల్లుల్లో దాడులు
పర్వతగిరి (సంగెం), వెలుగు: వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలోని రైస్ మిల్లులపై శనివారం సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. సతీశ్ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో 3951 మెట్రిక్ టన్నుల ధాన్యం సుమారు రూ.13 కోట్ల 21 లక్ష 87 వేల విలువ గల ధాన్యం, శ్రీసాయి ఇండస్ట్రీస్ లో 2588 మెట్రిక్ టన్నుల ధాన్యం, సుమారు రూ.8 కోట్ల 65 లక్షల 80 వేల విలువ గల ధాన్యం తేడా ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రైస్ మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు.