ఎస్​బీఐటీని సందర్శించిన జేఎన్టీయూ బృందం

ఎస్​బీఐటీని సందర్శించిన జేఎన్టీయూ బృందం

ఖమ్మం, వెలుగు: అటానమస్ హోదాను దక్కించుకున్న ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కాలేజీని సోమవారం హైదరాబాద్​ లోని జేఎన్​టీయూ అధికారులు సందర్శించారు. కళాశాల  ప్రమాణాలను  పరిశీలించారు.  జేఎన్​టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు విద్యార్థులతో, సిబ్బందితో మాట్లాడారు.    ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన విద్యార్థులు, సిబ్బందిని జేఎన్​టీయూ అధికారులు   పరామర్శించినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో వరద బాధిత విద్యార్థులకు, సిబ్బందికి నిత్యావసర వస్తువులను, ఆర్థిక సహాయాన్ని అందించారు.

కళాశాలలో ఈ విద్యా సంవత్సరం ప్లేస్మెంట్స్ పొందిన విద్యార్థులను  అభినందించారు.   న్యాక్ 'ఏ ప్లస్' , అటానమస్ హోదాను దక్కించుకున్న తరువాత మొట్టమొదటి సారి తమ కళాశాలను సందర్శించిన  బృందానికి కళాశాల సెక్రటరీ , కరస్పాండెంట్ జి. ధాత్రి  , ప్రిన్సిపల్ డా జి. రాజ్ కుమార్  కృతజ్ఞతలు  తెలిపారు.    ఈ  బృందంలో ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ వెంకటేశ్వరరెడ్డి , ప్రొఫెసర్ రమేశ్​  ఉన్నారు.