కార్పొరేషన్ గోదాంకే కన్నం

  •      ఇక్కడి నుంచే అక్రమంగా మిల్లులకు బియ్యం 
  •     ఫేక్ బిల్లులు సృష్టిస్తున్న గోడౌన్ స్టాఫ్ 
  •      ఎప్పటి నుంచో సాగుతున్న కాంట్రాక్టర్లు, మిల్లర్ల దందా
  •     ఆలస్యంగా మేలొన్న సివిల్​ సప్లై టాస్క్​ఫోర్స్​ వింగ్​ 

నల్గొండ, వెలుగు : జిల్లాలో సంచలనం కలిగించిన హాలియా, పెద్దవూర రేషన్​ బియ్యం అక్రమ రవాణా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ సంఘటన జరిగిన 14 రోజుల తర్వాత ఇప్పుడు సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​లో కదలిక వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లో నిందితుల పేర్లు తారుమారు చేశారంటూ ‘వెలుగు’లో వచ్చిన కథనానికి స్పందించిన సివిల్​ సప్లై టాస్క్​ఫోర్స్ అధికారులు శనివారం నల్గొండలోనిసివిల్​ సప్లై కార్పొరేషన్​ డీఎం ఆఫీసును తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించారు.

కేసులో ఇన్వాల్​ అయిన స్టేజ్​ వన్, స్టేజ్​ 2 కాంట్రాక్టర్ల వివరాలను సేకరించారు. ఎఫ్​ఐఆర్​లో స్టేజ్​ వన్​ కాంట్రాక్టర్​ పేరు చేర్చకుండా కేసుతో సంబంధం లేని కందుల వెంకట రమణ అనే వ్యక్తి పేరు ను ఏ1గా చేర్చారు. కొద్దిరోజులకే స్టేజ్​ వన్​ కాంట్రాక్టర్​ సమీప బంధువైన వెంకట రమణ పేరును ఎఫ్​ఐఆర్​ నుంచి తప్పించి.. అమ్మరైసు మిల్లు ఓనర్​ రామానుజరెడ్డి పేరును ఏ1గా చేర్చారు. 

ఆలస్యంగా మేల్కొన్న సివిల్​ సప్లై..

ఈ కేసు విచారణలో సివిల్​ సప్లై అధికారులను పోలీసులు ఇన్వాల్వ్ చేలేదు. దీంతో సివిల్ సప్లై ఆఫీసర్లు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడమేకాక, అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేసినట్టు ఆరోఫనలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సివిల్​సప్లై ఉనన్తాధికారులు శనివారం టాస్క్​ఫోర్స్ టీమ్స్ ను రంగంలోకి దింపారు. అసలు కార్పొరేషన్​ గోదాంలోకి ప్రైవేటు లారీలు ఎలా వచ్చాయి, స్టేజ్​వన్​ కాంట్రాక్టర్​బదులు పెద్దవూరకు చెందిన స్టేజ్​ టు 2 కాంట్రాక్టర్​ ఎలా బియ్యాన్ని తీసుకెళ్లాడు, రెండు లారీల్లో ఒకటి మాత్రమే స్టేజ్​ 2 కాంట్రాక్టర్​ శ్రీనివాసులు పేరు మీద ఉండగా ప్రైవేటు వ్యక్తులకు చెందిన మరో లారీ ఎలా వచ్చింది, కందుల వెంకట రమణను ఎందుకు అరెస్ట్​ చేయలేదన్న కోణంలో టాస్క్​పోర్స్​ అధికారులు ఎంక్వైరీ చేసినట్టు తెలిసింది.

గతంలో ఎంఎల్​ఎస్​ పాయింట్ల దగ్గర అక్రమాలు జరిగేవి కానీ, ఈ కేసులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ​ గోదాంకే కాంట్రాక్టర్లు, మిల్లర్లు కలిసి కన్నం వేశారు. సుమారు ఆరొందల టన్నుల బియ్యాన్ని అక్రమంగా తర లించారు. నల్గొండ ఎంఎల్​ఎస్​ పాయింట్​ దగ్గర దింపాల్సిన బియ్యాన్ని గోదాం సిబ్బంది ఫేక్​ బిల్లులతో పెద్దవూరలోని అ మ్మ రైస్ మిల్లుకు అక్రమంగా తరలించడం విస్మయానికి గురిచేసింది. 

25 లారీల్లో బియ్యం అక్రమ రవాణా...?

 రేషన్​ కార్డులునన్వారే తాము తీసుకున్న బియ్యాన్ని కేజీకి రూ.11లు చొప్పున తిరిగి డీలర్లకు అమ్ముతున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ప్రైవేట్​ వెహికల్స్ లో ​డీలర్లు రహస్య ప్రదేశాలకు తరలిస్తుంటారు. డీలర్ల ద్వారా సేకరించిన పీడిఎస్​ బియ్యాన్నే మిల్లర్లు సీఎమ్మా ర్ కింద ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నారు. సీఎంఆర్​ కింద పెద్ద ఎత్తున బియ్యం అవసరం కాగా వారు ఏకంగా గోడౌన్ల కే కన్నం వేశారు. బడా మిల్లర్లు, స్టేజ్ వన్, స్టేజ్ 2 కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై కార్పోరేషన్ ఈ అక్రమాలకు తెరలేపారు.

నల్గొండ జిల్లాలోనే ప్రతి నెల 25 లారీల్లో బియ్యం వేర్వేరు మిల్లులకు డంప్ అవుతోందని, ఒక్కో లా రీ కి రూ.నాలుగైదు లక్షల లాభం ఉంటుందని చెప్తున్నారు. ఈ లెక్కన పీడీఎస్ బియ్యం పేరిట ప్రతి నెల రూ.కోటి 25 లక్షలు అందరూ కలిసి అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు సివిల్ సప్లై ఆఫీసర్ ఒకరు చెప్పారు.