కరెంట్ కట్ చేసిన సిబ్బందిపై తిర్గబడ్డ తండా

కరెంట్ కట్ చేసిన సిబ్బందిపై తిర్గబడ్డ తండా

మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడ మండలం రేణ్య తండాలో విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ విద్యుత్ కలెక్షన్ల కు సంబంధించిన వైర్లను కట్ చేశారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులను రేణ్య తండా వాసులు అడ్డుకుని.. కట్ చేసిన కరెంటు తీగలను లాక్కున్నారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, తండా వాసులకు మధ్య గొడవ జరిగింది. 

తండాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందంటూ విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉచిత విద్యుత్ మా హక్కు.. వాడుకుంటాం..తిరిగి వెళ్లిపోండి’అని రేణ్య తండా వాసులు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పారు.