రామప్ప శిల్పకళ అద్భుతం

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప టెంపుల్ ను మంగళవారం హైదరాబాద్​ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఏఎస్వో, సీసీఎస్ అధికారులు సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గైడ్ ద్వారా రామప్ప చరిత్ర, శిల్పకళ నైపుణ్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం టెంపుల్ శిల్పకళా అద్భుతంగా ఉందని కొనియాడారు. రామప్ప లేక్ లో బోటింగ్ చేశారు. వారివెంట ఎంసీహెచ్ ఆర్ డీఐటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి.శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.