యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..

యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..

సికింద్రాబాద్, వెలుగు : ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ యూనియన్ బ్యాంక్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ను ఎవరూ నమ్మొద్దని సదరు బ్యాంకు అధికారులు సూచించారు. ఆధార్ అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే మీ అకౌంట్ బ్లాక్​ అవుతుందంటూ చాలా మందికి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయన్నారు. మెసేజ్లోని ఆ యాప్ను డౌన్​లోడ్ గానీ ఓపెన్ గానీ చేస్తే వెంటనే ఫోన్ హ్యాక్ అయి హ్యాకర్ల చేతి వెళ్తుందన్నారు. 

బేగంపేటకు చెందిన ఓ ఖాతాదారుడు ఈ యాప్​ లింక్ను ఓపెన్​ చేయడంతో ఖాతాలో రూ.28 వేలు డ్రా అయ్యాయి. దీంతో సదరు ఖాతాదారుడు బ్యాంకు అధికారులను సంప్రదించి సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.