వరదకాలువకు నీళ్లు విడుదల 

యాసంగిలో రైతుల ఇబ్బందుల దృష్ట్యా అధికారులు సోమవారం వరదకాలువకు నీటిని వదిలారు. మల్యాల మండల పరిధిలోని వరదకాలువ పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందారు.

దీంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు రాంపూర్ పంపు హౌస్ నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏఈ తిరుపతి పేర్కొన్నారు. వరదకాలువకు నీటిని విడుదల చేయడంతో రైతులు, కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. 

 మల్యాల, వెలుగు