మొన్న మంత్రి మల్లారెడ్డి.. ఇవాళ మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. తన కాంప్లెక్స్ కనిపించడం లేదని మంత్రి మల్లారెడ్డి ఏకంగా 70 చెట్లను నరికించారనే ఆరోపణలు ముగియక ముందే..తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభకు మొక్కలు అడ్డంగా ఉన్నాయని అధికారులు వాటిని తొలగించారు.
యాదాద్రి జిల్లా ఆలేరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ కోసం హరితహారం మొక్కలను అధికారులు తొలగించారు. సుమారు 30 మొక్కలను తొలగించినట్లు సమాచారం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన గౌడ సంఘం భవనంతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో మొక్కలను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం..