వరదలో చిక్కుకున్న కూలీలు.. కాపాడిన గజ ఈతగాళ్లు

భారీగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నం బ్రిడ్జి దగ్గర నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఇద్దరు కూలీలు బ్రిడ్జి మధ్య వరద నీటిలో చిక్కుకున్నారు. తాత్కాలిక రోడ్డు బ్రిడ్జి మధ్య చిక్కుకుని కాపాడాలంటూ అరిచారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు బ్రిడ్జి దగ్గరకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో  తాళ్లు వేసి ఇద్దరు కూలీలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.  దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.