వీ6 కథనానికి స్పందన.. వార్డెన్ ను సస్పెండ్ చేసిన అధికారులు

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల సమస్యలపై వీ6 ఛానెల్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. స్కూల్ వార్డెన్ ను సస్పెండ్ చేశారు. విద్యార్థినులకు సరిపడా భోజనం పెట్టడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నా వార్డెన్ పట్టించుకోవట్లేదని, టీచర్లు అకారణంగా స్టూడెంట్స్ ను కొట్టడాన్ని వీ6 వెలుగులోకి తెచ్చింది. కథనం ప్రసారమైన 24 గంటల్లోపే స్పందించిన ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 

విద్యార్థులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నాయి. వారికి ఇస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు విన్న ఆనంద్... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అనంతరం కలెక్టర్ భారతి హోలీకేరీ ఆదేశాలతో  డీఈవో వెంకటేశ్వర్లు పాఠశాల ఎస్. ఓ అమూల్య ను డీఈఓ సస్పెండ్ చేశారు.

విద్యార్థులతో మాట్లాడిన తర్వాత జిల్లా కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలకు తీసుకుంటానని హెచ్చరించారు.