
- మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 70,713
- టీచర్ ఓటర్లు 7,249
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 70,713 ఓటర్లు ఉండగా, టీచర్ ఓటర్లు 7,249 మంది ఉన్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉండగా వారిలో పురుషులు 8,879 మంది, మహిళలు 3,593 మంది ఉన్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీచర్ఓటర్లు మొత్తం 1,347 మంది ఉండగా, వారిలో పురుషులు 799, మహిళలు 549 మంది ఉన్నారు. ఈ మేరకు టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు గాను 22 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను, 22 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను 44 మంది ఓపీఓలను, ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, మూడు వీఎస్టీ టీమ్లు, 21 ఎంసీసీ టీమ్లు,9 మంది సెక్టోరియట్ఆఫీసర్లు, 9 మంది రూట్ఆఫీసర్లను నియమించారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా టీచర్స్ ఓటర్లు మొత్తం 2,690 మంది ఉండగా, వీరిలో పురుషులు 1,520 మంది, మహిళలు 1,170 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు 25,652 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 17,383 మంది, మహిళలు 8,269 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకు గాను 667 మంది ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు డివిజన్ల వారీగా పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తే సంగారెడ్డి 11, జహీరాబాద్ 6, ఆందోల్-జోగిపేట 4, నారాయణఖేడ్ డివిజన్ లో 7 కలిపి మొత్తం 28 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం గ్రాడ్యుయేట్స్ ఓటర్లు 31,546 మంది ఉండగా వీరిలో మహిళలు 10,624, పురుషులు 20, 922 ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో టీచర్స్ ఓటర్లు మొత్తం 3,052 మంది ఉండగా వీరిలో పురుషులు 1,948, మహిళలు 1,104 ఉండగా వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొననున్నారు. జిల్లా వ్యాప్తంగా 419 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు విధుల్లో పాల్గొన్ననున్నారు. 8 రూట్ మొబైల్ పార్టీలు ,24 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , 3 ఎఫ్ఎస్ టీ, 45 వీఎస్టీ టీంలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.