మేళ్లచెరువు, వెలుగు : ఎంపీడీఓ ఆఫీస్ లో మంగళవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. దీంతో ప్రజా సమస్యల ప్రస్తావనే లేకుండా పోయింది. హాజరైన ప్రజా ప్రతినిధుల్లో కందిబండ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కలిసి ఆఫీసర్లను నిలదీశారు.
మేళ్లచెరువు మెయిన్ రోడ్ పై ఆక్రమణలు తొలగించాలని మరికొందరు డిమాండ్ చేశారు. గ్రామాల్లో కుక్కలు, కోతుల బెడద ఎక్కువైనా పట్టించుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని ఎంపీడీవో ఇషాక్ హుస్సేన్ తెలిపారు. కాగా 12శాఖల ఆఫీసర్లు,12మంది సర్పంచులు మీటింగ్ కు ముఖం చాటేశారు.