10 రోజుల్లో 1,203 కిలోల గంజాయి సీజ్

10 రోజుల్లో 1,203 కిలోల గంజాయి సీజ్
  • రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్‌‌మెంట్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌‌లో 1203 కిలోల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. 1.7 కిలోల అల్ఫ్రాజోలమ్, 0.46 కిలోల డైజోఫామ్ పట్టుకున్నారు. వీటికి సంబంధించి అధికారులు 116  కేసులు  బుక్ చేయడంతో పాటు 147 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.  

రాష్ట్రంలో  జనవరి 22 నుంచి 31వ తేదీ వరకూ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గుడుంబా పెద్ద మొత్తంలో అమ్ముడవుతున్నట్టు గుర్తించారు. జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో 4126 లీడర్ల గుడుంబా, 57,980 లీటర్ల ఎఫ్‌‌జే వాష్‌‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తంగా 1066 కేసులు బుక్ చేసి, 976 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.