మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటి తరలింపు

మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటి తరలింపు

కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి నీటిని తరలించే ప్రక్రియను అధికారులు మంగళవారం ప్రారంభించారు. గతంలో పంప్ హౌస్ లో సమస్యల తలెత్తడంతో నీటి విడుదలను నిలిపేశారు. తాజాగా పంప్ హౌస్ మోటార్ల సమస్యలను పరిష్కరించి మొదటి పంప్ హౌస్ నుంచి ప్రాజెక్టు లోకి నీటిని తరలిస్తున్నారు. మరో పంప్ హౌస్ మోటార్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరు ఉందని, మరో 0.2 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తామని ఈఈ అమరేందర్ రెడ్డి తెలిపారు. 

ఎల్లంపల్లి నుంచి సాగునీరు విడుదల

ముత్తారం, వెలుగు: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ముత్తారం మండలంలోని యాసంగి పంటల కోసం మంగళవారం అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి సాగునీటి అవసరాలపై పలువురు రైతులు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించారు. ఈ సందర్భంగా మంత్రికి  లీడర్లు చొప్పరి సదానందం, దొడ్డ బాలాజీలు రైతులు పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.