
వర్ధన్నపేట, వెలుగు: అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేత చర్యలు తీసుకున్నారు. బుధవారం వరంగల్జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ వద్ద సర్వే నెంబర్ 32లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఎమ్మార్వో విజయ సాగర్ నేతృత్వంలో కూల్చివేశారు. కట్ర్యాల పంచాయతీ సిబ్బందితో కలిసి ఎమ్మార్వో, అక్రమ కట్టడాలను తొలగించారు.