కొండ చిలువను పట్టుకున్న ఎమ్మెల్యే నోముల భగత్

ఎమ్మెల్యే నోముల భగత్ గురించి తెలియని వారుండరు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఆయన పులిని పట్టుకొని నడుస్తున్న వీడియో అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.   శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారులతో కలిసి పెద్ద కొండ చిలువను పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. 

 హాలియా, వెలుగు