- మహిళా సంఘాల సభ్యులకు బెదిరింపులు
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్లో సోమవారం జరుగనున్న మంత్రి కేటీఆర్ సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, అధికారులు తిప్పలు పడుతున్నారు. మంత్రి సభకు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేయాలని ఆదేశాలు రావడంతో మహిళా సంఘాలపై దృష్టి సారించారు. మంత్రి సభకు రావాలని మహిళా సంఘాల సభ్యులను ఆర్పీలు బెదిరిస్తున్నారు.
‘రేపు ఉదయం 9.30 గంటలకు మంత్రి కేటీఆర్ గారు వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆ మీటింగ్కు హాజరుకావాలి. అక్కడ లంచ్ కూడా అరేంజ్ చేశారు. మా పై అధికారులు మాకు మెమోలు ఇస్తాం అన్నారు. నేను సీరియస్గా చెబుతున్నా. మంత్రి సభకు రానివాళ్లు ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి లోన్ కావాలని అడగొద్దు’ అంటూ ఆర్పీలు మహిళా సంఘాలకు వాట్సాప్ద్వారా వార్నింగ్మెసేజ్లను పంపుతున్నారు.