
బడంగ్పేట, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా స్కూల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించడంతో హెచ్ఎంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సరూర్నగర్ నందనవనం ఎంపీపీ పాఠశాలలో ఈ నెల 17న కేసీఆర్బర్త్ డే వేడుకలను ఆ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్ రజితను డీఈవో సుశీందర్ రావు మంగళవారం సస్పెండ్ చేశారు.