హుజూరాబాద్‌లో మున్సిపల్​ స్థలం కబ్జా 

కరీంనగర్, వెలుగు: హుజురాబాద్ పట్టణం బస్టాండ్​ సమీపంలోని మున్సిపాలిటీకి చెందిన స్థలం కబ్జాకు గురైంది. జమ్మికుంట రోడ్డులోని ఉడిపి హోటల్ పక్కన ఉన్న మున్సిపాలిటీ స్థలంలో కొందరు రాత్రికిరాత్రే గోడ కట్టేశారు. రెండు రోజులు సెలవులు రావటంతో ఆధికారుల కళ్లుగప్పి చకచకా పనికానిచ్చేశారు. మున్సిపాలిటీకి చెందిన ఈ స్థల వివాదం కోర్టులో ఉందని టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్లు తెలిపారు.

ALSO READ :గురుకుల టీచర్ల.. సమస్యలు పరిష్కరించాలి

నాలుగు నెలల క్రితం ఇదే స్థలంలో సంప్​ నిర్మించడానికి ప్రయత్నిస్తే దానిని తొలగించినట్లు చెప్పారు. కోర్టు ఆర్డర్​కు విరుద్ధంగా పనులు చేపట్టిన విషయమై కోర్టులో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ స్థల కబ్జా సమాచారం తమకు తెలిసిందని, తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్​ కమిషనర్​ సమ్మయ్య తెలిపారు.