సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం గట్టేపెల్లి గ్రామ శివారు మానేరు వాగు సమీపంలోని ఇసుక రీచ్‌ను మైనింగ్, భూగర్భ శాఖ, రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇసుక రీచ్‌ను బంద్ చేయాలని అధికారులను కోరారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇసుక రీచ్ వల్ల మానేరు వాగులో 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు ఇసుక తోడారని, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని వాపోయారు.
దీనిపై గతంలోనే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు జిల్లా గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, తహసీల్దార్, సీఐ, ఎస్ఐ తదితరులు రీచ్ వద్దకు చేరుకొని గ్రామస్తుల సమస్య విన్నారు. అధికారులు మాట్లాడుతూ ఇసుక రీచ్‌పై కలెక్టర్‌కు నివేదిస్తామని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీటీసీ శీలం శంకర్, కాంగ్రెస్ లీడర్లు డి. దామోదర్ రావు, రాజమౌళి, కనుకయ్య, వీరస్వామి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, ముజాహిద్, గౌస్, సంతోష్ పాల్గొన్నారు.