కడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను సందర్శించిన అధికారులు

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును సందర్శించారు సీఈ శ్రీనివాస్, డీసీఈ మహేందర్ రెడ్డి, SE రవీందర్. ప్రాజెక్టు మరమ్మత్తు పనులను పరిశీలించారు. జూన్ మొదటి వారం వరకు ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు  సీఈ శ్రీనివాస్. ఇప్పటివరకు 360 బేరింగ్ లకు గాను 240 బేరింగ్ లు బిగించారని సీఈ కి తెలిపారు అధికారులకు. మరో 140 బేరింగ్ లను రెండు మూడు రోజుల్లో బిగిస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు చెందిన ఎలక్ట్రిషన్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సీఈ శ్రీనివాస్, డీసీఈ మహేందర్ రెడ్డికి తెలిపారు అధికారులు.