కామారెడ్డిలో కేవీ సబ్​స్టేషన్​ను పరిశీలించిన అధికారులు

కామారెడ్డిలో కేవీ సబ్​స్టేషన్​ను పరిశీలించిన అధికారులు

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్​ పార్క్​ పక్కన 33/11 కేవీ సబ్​స్టేషన్​లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని బుధవారం ఎన్పీడీసీఎల్​ ఉన్నతాధికారులు పరిశీలించారు. హెచ్​ఆర్​డీ డైరెక్టర్ బి.అశోక్​కుమార్, ఇతర అధికారులు పరిశీలించారు. 

ప్రమాదం జరిగిన తీరును స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్​ఫార్మర్లు, ఇతర పరికరాలు పూర్తిగా కాలిపోవడంతో, కొత్త పవర్​ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటుకు సీఎండీ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్ఈ శ్రవన్, డీఈలు కల్యాణ చక్రవర్తి, నాగరాజు, స్వామి తదితరులున్నారు.