నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు పెరిగిన వరద .. 16 గేట్లు ఎత్తిన అధికారులు

హాలియా, వెలుగు : కృష్ణా నది పరీవాహకంలో భారీ వర్షాలు పడుతుండడంతో నది ఉధృతంగా పారుతోంది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు 1,78,983 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో సాగర్‌‌‌‌‌‌‌‌ 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  

నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీ) కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండింది. సాగర్‌‌‌‌‌‌‌‌ నుంచి కుడి కాల్వ ద్వారా 9,443 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,280, విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి ద్వారా 29,354, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ ద్వారా 1,800, వరదకాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.