యాదాద్రి జిల్లాలో .. బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

యాదగిరిగుట్ట, వెలుగు : బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బాలికను, ఆమె మేనబావకు ఇచ్చి పెండ్లి చేయడానికి పేరెంట్స్, బంధువులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​లో బచ్చన్నపేటలో పెండ్లి చేస్తుండగా సమాచారం అందుకున్న చైల్డ్ ప్రొటెక్షన్​డిపార్ట్​మెంట్, హెల్ఫ్​లైన్ స్టాఫ్​ అక్కడికి వెళ్లి పెండ్లిని అడ్డుకున్నారు. అయినా ఈసారి యాదాద్రి జిల్లాలోని మోటకొండూరు మండలం తేరాల గ్రామంలో పెండ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. 

అయితే.. బాల్యవివాహం జరుగుతున్నదని చైల్డ్ హెల్ఫ్ లైన్​ (1098)కు సమాచారం అందింది. దీంతో చైల్డ్​ ప్రొటెక్షన్​డిపార్ట్​మెంట్, హెల్ఫ్​లైన్​స్టాఫ్ తేరాలకు చేరుకొని పెండ్లి నిలిపివేశారు. అనంతరం చైల్డ్​వెల్ఫేర్ కమిటీ ఎదుట బాలిక, ఆమె పేరెంట్స్​ను హాజరుపరిచారు. దీంతో కమిటీ చైర్మన్​ బండారు జయశ్రీ, కమిటీ మెంబర్లు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను సఖి సెంటర్​కు తరలించారు. కౌన్సిలింగ్​ఇచ్చినవారిలో సీడబ్ల్యూసీ మెంబర్లు రుద్రమదేవి, ఇస్తారి, మల్లేశ్, శివరాజ్, డీసీపీవో పులుగుజ్జు సైదులు, చైల్డ్ లైన్ కో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆర్డినేటర్ దశరథ, చైల్డ్ లైన్ సూపర్​వైజర్ బాలాంజలి, కౌన్సిలర్ స్వప్న, శ్రీకాంత్, హరిబాబు ఉన్నారు.