​ఆఫ్ లైన్​లో రాజీవ్​ యువ వికాసం అప్లికేషన్లు : రాజీవ్​గాంధీ​హనుమంతు

​ఆఫ్ లైన్​లో రాజీవ్​ యువ వికాసం అప్లికేషన్లు : రాజీవ్​గాంధీ​హనుమంతు
  • కలెక్టర్​ రాజీవ్​గాంధీ​హనుమంతు

నిజామాబాద్, వెలుగు:  రాజీవ్​గాంధీ యువ వికాసం స్కీమ్​కు ఆఫ్​లైన్​లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. ఎంపీడీవో, మున్సిపల్​ ప్రజాపాలన సెంటర్లలో రెడీగా పెట్టిన దరఖాస్తులలో వివరాలు ఎంటర్​ చేసి అందించాలన్నారు. మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు. 

క్యాస్ట్​, ఇన్​కమ్​ సర్టిఫికెట్లతో పాటు ఆధార్, పాన్​కార్డు, పాస్ పోర్టు సైజ్​ ఫొటో, ఫోన్ నంబర్​తో పాటు అప్లికేషన్​లు అందజేయాలన్నారు. ఇది వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకున్న వారు కొత్తగా ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాలు స్కీమ్​కు అర్హులన్నారు. ప్రభుత్వం ఈనెల 14 వరకు రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల గడువు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఇవాళ సర్వాయి​ పాపన్న వర్థంతి

సర్దార్​ సర్వాయి పాపన్నగౌడ్​ వర్థంతి, దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను  బుధవారం అధికారికంగా నిర్వహించనున్నామని కలెక్టర్​ రాజీవ్​గాంధీ తెలిపారు. ఉదయం 9 గంటలకు వినాయక్​ నగర్​ వద్ద గల హనుమాన్ జంక్షన్​లో సర్వాయి పాపన్న గౌడ్​ వర్థంతి ప్రొగ్రాం తరువాత పదిన్నర గంటలకు కలెక్టరేట్​లో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహిస్తామన్నారు.