JNTUH పరిధిలో ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభం

JNTUH పరిధిలో ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభం

హైదరాబాద్: కూకట్ పల్లి జేఎన్టీయూ పరిధిలో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు (ఆఫ్లైన్  ఫిజికల్ క్లాసులు) ఇవాళ ప్రారంభం అయ్యాయి. కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 12వ తేదీ వరకు ఫస్ట్.. సెకండ్ ఈయర్ విద్యార్థులకు ఆన్ లైన్ లోనే క్లాసులు జరుగుతాయని అంతకు ముందు యూనివర్సిటీ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా అధికారులు సీరియస్ అయ్యారు. ఈనెల 1వ తేదీ నుండి అన్ని స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని మీరెలా నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిజికల్ క్లాసులు ప్రారంభిస్తున్నట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేసి బుధవారం అన్ని కాలేజీలు ప్రారంభించినట్లు ధృవీకరించుకుంటున్నారు.