మలయాళ ఎంట్రీ:: దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్

మలయాళ ఎంట్రీ:: దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్

నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్.. తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం చిత్రాలతోపాటు డాక్టర్, డాన్, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలతో  ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో  బ్యాక్‌‌‌‌‌‌‌‌ టు బ్యాక్ ఆఫర్స్ దక్కించుకుంటూ క్రేజీ ప్రాజెక్టుల్లో చాన్స్ అందుకుంటోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంలో నటిస్తున్న ప్రియాంకకు తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌కు జోడీగా నటించే చాన్స్ అందుకుందని సమాచారం. దుల్కర్ హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రంలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా ప్రియాంకను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నకాశ్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌‌‌‌‌‌‌‌జే సూర్య మరో కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది.

ఈ చిత్రంపై  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదేకనుక నిజమైతే  ప్రియాంక మోహన్ మలయాళ ఎంట్రీ కూడా ఖారారైనట్టే.  కన్నడ హీరోయిన్‌‌‌‌‌‌‌‌ అయినా అతి తక్కువ సమయంలోనే సౌత్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీలో మంచి ఆదరణ దక్కించుకుంటూ ప్రియాంక  దూసుకెళ్తోంది.