పవన్ ని ఇబ్బంది పెట్టకండంటున్న ఓజి మేకర్స్.. ఏం జరిగిందంటే..?

పవన్ ని ఇబ్బంది పెట్టకండంటున్న ఓజి మేకర్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజెజ్ ఉండటంతో షూటింగ్ పూర్తీ కాలేదు. దీంతో వచ్చే ఏడాది మార్చ్ లో ఓజి సినిమా రిలీజ్ ఉటుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే వచ్చే ఏడాది కూడా ఓజి రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. 

దీంతో పవన్ ఫ్యాన్స్ ఓజి సినిమా అప్డేట్స్ ఇవ్వాలంటూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై ఓజి సినిమా నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా "OG సినిమా పై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. OG సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా OG OG అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు.వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025-0G పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం " అని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ శనివారం గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించడానికి కాకినాడకి వెళ్ళాడు. ఈక్రమంలో మీడియా రిపోర్టర్స్   తో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు కూడా ఓజీ.. ఓజీ.. ఓజీ... అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడేం స్లొగన్స్ ఇవ్వాలో తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సినిమాల గురించి అడుగుతారేంటీ అంటూ  సీరియస్ అయ్యాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగులో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ మొదలైన తర్వాత ఎన్నికలు రావడంతో పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తున్నాడు. కానీ అప్పుడప్పుడు సమయం తీసుకుని  షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో సమయం ఇవ్వలేకపొతున్నాడు. దీంతో ఈ సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతోంది.