ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : మంత్రులు శ్రీధర్​బాబు

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : మంత్రులు శ్రీధర్​బాబు
  • ఓగా వెల్​నెస్​సెంటర్ లో ఫిజియోథెరపి, డెంటల్​సర్వీసులు ప్రారంభం
  •  పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్​బాబు, ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

గచ్చిబౌలి, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రులు శ్రీధర్​బాబు, ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని ఓగా వెల్​నెస్​సెంటర్​లో కొత్తగా ఫిజియోథెరపీ, డెంటల్, ఫేషియల్​ఎస్తటిక్స్, ఫిట్​నెస్, బాక్సింగ్, జుంబా, యోగా వంటి సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వాటిని మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, శ్రీధర్​బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, మిసెస్​ఏసియా ఫసిపిక్​శిల్పా కటారియా సింగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొని గురువారం ప్రారంభించారు.

ఆధునిక టెక్నాలజీతో ఇలాంటి వెల్​నెస్​సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఓగా వెల్​నెస్​సెంటర్​ఎండీ సంధ్య గోలి, పలువురు పాల్గొన్నారు.