అయ్యో అయ్యయ్యో.. : రూ.3 లక్షలను ఈ కుక్క తినేసింది..!

పెంపుడు కుక్కలకు కడుపునిండి తిండి పెట్టాలి.. లేదంటే అవేం చేస్తాయో తెలుసా.. ఇదిగో ఈ కుక్కలా డబ్బు కట్టలను కూడా తినేస్తాయి. అదేంటీ కుక్కు ఏంటీ.. నగదు నోట్లను తినడమేంటీ అనుకుంటున్నారా.. అవునండీ.. నిజమే.. మంచి ఆకలిమీద ఉందే ఏమో మరీ.. ఏకంగా 3 లక్షల విలువైన నోట్లను తినేసింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.... ఈ విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనకు సంబంధించిన వీడియో  వైరల్ అవుతోంది.

పెన్సిల్వేనియాకు చెందిన ఓ యువజంట.. అప్పుడే బ్యాంకు నుంచి తీసుకొచ్చిన 4వేల డాలర్ల నగదును వారి పెంపుకుక్క తినేసిందని కేవలం 30 నిమిషాల్లోనే అది మొత్తం తినేసిందని..ఈ విషయాన్ని  ఇన్ స్టాలో  షేర్ చేసి విషాదంతో కూడిన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తం కావడంతో నగదు పోయిందని, తమ కుక్కు ఏమవుతుందోని కొంత ఆందోళన చెందారు. అయితే కొంత కుక్క వాంతి చేసుకోవడం ద్వారా, మరొకొత కుక్క మలం ద్వారా కొంత రికవరీ చేశామని చెప్పుకొచ్చారు. పెద్ద మొత్తం కదా.. వదులుకోలేక చేతులకు గ్లౌజ్ లు వేసుకొని సింక్ డబ్బులు కడుకున్నారు.