అమ్మో.. ట్రాఫిక్ డ్యూటీనా.. తగినంత స్టాఫ్ లేక కానిస్టేబుళ్ల కష్టాలు

అమ్మో..  ట్రాఫిక్ డ్యూటీనా.. తగినంత స్టాఫ్ లేక కానిస్టేబుళ్ల కష్టాలు

5,340 వాహనాలకు ఒక ట్రాఫిక్ పోలీసు

మూడు కమిషనరేట్లలో 3,608 మందే..

అందులో 1904 మంది హోంగార్డులే..

ఏండ్లు గడుస్తున్నా పెరగని సిబ్బంది

 ట్రాఫిక్ డ్యూటీ అంటేనే స్టాఫ్ లో  టెన్షన్

హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్ వింగ్ను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏండ్ల తరబడి సరిపడా కేటాయింపులు లేక అవస్థలు పడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వెహికల్స్ సంఖ్యతో డ్యూటీ చేయాలంటేనే పోలీసులు హడలిపోతున్నారు. ఉన్న కొద్దిమంది సిబ్బందితో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలంటే చుక్కలు కన్పిస్తున్నాయి. సీసీ టీవీ కెమెరాలు, సిగ్నల్స్కి వదిలేస్తున్నారు. పని భారం పెరగడంతో అనారోగ్యాల పాలవుతున్నారు. గ్రేటర్ రోడ్లపై తిరిగే 70 లక్షల వెహికల్స్లో ప్రతి 5,340 వెహికల్స్ కి ఒకే ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ చేస్తున్నాడు. దీనికి తోడు పెరుగుతున్న వెహికల్స్ తో ట్రాఫిక్ కంట్రోల్ తప్పుతోంది.

మూడు కమిషనరేట్లలో 3,608 మందే..

గ్రేటర్లో మొత్తం 48 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.  డీసీపీ నుంచి హోంగార్డు వరకు మొత్తం 3,608 మంది  ఉన్నారు. అడ్మిన్ సిబ్బంది మినహా ఎస్సైలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ పాయింట్ డ్యూటీ చేస్తుంటారు. పెరిగిపోతున్న వెహికల్స్ ట్రాఫిక్ పోలీసులకు సవాల్గా మారుతున్నాయి.

రెండొంతులు హోంగార్డులే..

మూడు కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ వింగ్లో సగానికి పైగా హోంగార్డ్స్ నే ఉన్నారు.  మొత్తం 3,608 మందిలో 1,904 మంది వీరే. సుమారు 800 ట్రాఫిక్ పాయింట్స్లో కేవలం 380 లోపు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు, మరో 80 ప్రాంతాల్లో హోంగార్డ్స్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. వెహికల్స్కి తగినంతగా ట్రాఫిక్ సిబ్బంది కేటాయింపులు జరగకపోవడంతో సిటీ ట్రాఫిక్ లో కొత్త ప్రాబ్లమ్స్తలెత్తున్నాయి.

నో రెస్ట్ 

ట్రాఫిక్ పోలీసులకు  భారీ వర్షాలు సవా ల్గా మారాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా, రోడ్లపై నిలిచిన నీళ్లను క్లియర్ చేయడం,  ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. వెహికల్స్ ను మళ్లించేందుకు  సైన్ బోర్డులను పెట్టాలి. ఇలా.. బల్దియా సిబ్బంది కంటే ఎక్కువ పని ట్రాఫిక్ సిబ్బందే చేయాల్సి వస్తుంది. షిఫ్ట్లు, వీక్లీ ఆఫ్లు కూడా తీసుకోలేని పరిస్థితులు నెలకొ న్నాయి.  దీనికితోడు పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా సిటీలో ఎక్కువే.  ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ సంఖ్యలో అనా రోగ్యానికి గురవు తున్నారు. తక్కువ రెస్ట్తో ఎక్కువ సేపు సిటీ ట్రాఫిక్లో అవస్థలు పడుతున్నారు.