వోల్టాతో చేతులు కలిపిన  ఓహెచ్‌‌‌‌ఎమ్

వోల్టాతో చేతులు కలిపిన  ఓహెచ్‌‌‌‌ఎమ్

హైదరాబాద్, వెలుగు:   తక్కువ ధరల్లో సేవలు అందించడానికి రైడ్ బుకింగ్ యాప్ వోల్టా, రైడ్- హైలింగ్ యాప్ ఓహెచ్‌‌‌‌ఎమ్ ఆటోమోటివ్‌‌‌‌ చేతులు కలిపాయి.  ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కి రైడ్స్​ కేవలం రూ.799 నుంచి మొదలవుతాయి. వీటికితోడు ఇతర ప్రాంతాలకూ సేవలు అందిస్తారు.  ఎయిర్‌‌‌‌పోర్ట్ సిటీ సేవలతోపాటు నగరంలో సేవలు అందించడానికి ఓహెచ్‌‌‌‌ఎమ్ ఎలక్ట్రిక్ క్యాబ్‌‌‌‌లనూ ప్రారంభించింది.

తమ వద్ద 600 కంటే ఎక్కువ వెహికల్స్​ఉన్నాయని, పర్యావరణ అనుకూల ప్రయాణ సేవలు అందించడానికి ప్రాధాన్యం ఇస్తామని ఓహెచ్​ఎమ్​ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ క్యాబ్‌‌‌‌లలో సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు ఉంటాయని వోల్టా ఫౌండర్​ శశికాంత్ కనపర్తి,  ఓహెచ్‌‌‌‌ఎమ్ ఫౌండర్​ నిర్మల్ రెడ్డి చెప్పారు.