ఆయిల్, గ్యాస్‌‌‌‌ కంపెనీలపై ఐదో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనూ ఫైన్‌‌‌‌

ఆయిల్, గ్యాస్‌‌‌‌ కంపెనీలపై ఐదో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనూ ఫైన్‌‌‌‌

న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనలను ఫాలో కాకపోవడంతో  ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు ఐఓసీ, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌, బీపీసీఎల్‌‌‌‌, ఆయిల్ ఇండియా, గెయిల్‌‌‌‌, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్‌‌‌‌పై వరుసగా ఐదో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనూ బీఎస్‌‌‌‌ఈ, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ఫైన్ వేశాయి. ఈ ఏడాది ఏప్రిల్– జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కూడా ఈ కంపెనీ బోర్డుల్లో సరిపడింత ఇండిపెండెంట్ డైరెక్టర్లు, వుమెన్ డైరెక్టర్లు లేరు. 

డైరెక్టర్ల నియామకం ప్రభుత్వం చేతిలో ఉంటుందని, తమకు సంబంధం లేదని ఈ కంపెనీలు సపరేట్‌‌‌‌గా ఎక్స్చేంజ్ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొన్నాయి. కాగా, రూల్స్ ప్రకారం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తగ్గ ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించుకోవాలి. అంతేకాకుండా కనీసం ఒక మహిళా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌నైనా నియమించుకోవాలి. ఐఓసీపై ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ, బీఎస్‌‌‌‌ఈ రూ.5,36,900 చొప్పున ఫైన్ వేశాయి. బీపీసీఎల్‌‌‌‌పై రూ.2,41,900 చొప్పున, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌,  గెయిల్‌‌‌‌పై సపరేట్‌‌‌‌గా  రూ.5,36,900 చొప్పున ఫైన్ వేశాయి.

మరిన్ని వార్తలు