పెరిగిన కమర్షియల్ ఎల్‌‌పీజీ రేటు

పెరిగిన కమర్షియల్ ఎల్‌‌పీజీ రేటు

న్యూఢిల్లీ: హోటల్స్‌‌, రెస్టారెంట్లు వాడే కమర్షియల్ ఎల్‌‌పీజీ రేట్లను ఆయిల్‌‌ మార్కెటింగ్ కంపెనీలు  పెంచాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.39 పెంచుతూ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీంతో 19 కేజీల సిలిండర్ ధర ముంబైలో  రూ.1,644 కి, చెన్నైలో రూ.1,855 కి, కోల్‌‌కతాలో రూ.1,802.50 కి  పెరిగింది. ఇండ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం రూ.803 దగ్గర కొనసాగుతోంది.  

  మరోవైపు విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్‌‌ ఫ్యూయల్‌‌ (ఏటీఎఫ్‌‌) రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. కిలోలీటర్‌‌‌‌కు రూ.4,495.5 లేదా 4.58 శాతం తగ్గించాయి. దీంతో కిలో లీటర్‌‌‌‌ ఏటీఎఫ్ ధర న్యూఢిల్లీలో రూ.93,480.22 పలుకుతోంది. ముంబైలో  ఈ రేటు రూ.87,432.78 గా ఉంది.   లోకల్ ట్యాక్స్‌‌లను బట్టి  వేరు వేరు రాష్ట్రాల్లో ధరలు వేరు వేరుగా ఉంటాయి. కాగా, ప్రతి నెల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏటీఎఫ్‌‌, ఎల్‌‌పీజీ రేట్లను సవరిస్తున్నాయి.