LPG Rates: తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లు.. హైదరాబాదులో ఎంతంటే..?

LPG Rates: తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లు.. హైదరాబాదులో ఎంతంటే..?

LPG Prices Cut: ప్రతి నెల మాదిరిగానే ఏప్రిల్ 1న కూడా అనేక మార్పులు వచ్చాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు నెల మెుదటి రోజున తమ ఎల్‌పీజీ ధరల్లో కీలక మార్పులను ప్రకటించాయి.

ఆయిల్ కంపెనీలు నేడు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరటను ప్రకటించాయి. నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును రూ.41 మేర తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశంలోని ప్రధాన మెట్లో నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. గతంలో రూ.1వెయ్యి755 వద్ద ముంబైలో ఉన్న రేటు రూ.1వెయ్యి 714కి తగ్గించబడింది. అలాగే కలకత్తాలో రూ.1వెయ్యి 913గా ఉన్న రేట్లు రూ.1వెయ్యి 872కి తగ్గాయి. ఇక చెన్నైలో గతంలో రూ.1వెయ్యి 965గా ఉన్న రేటు ప్రస్తుతం రూ.1వెయ్యి 924కి తగ్గించబడింది. ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిన తర్వాత ఒక్కోటి రూ.1వెయ్యి 988 వద్ద అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు మార్కెట్లలో కొనసాగుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు ఎప్పటికప్పుడు గ్యాస్, సీఎన్జీ, పీఎన్జీ ధరలను ప్రతి నెల సవరిస్తుంటాయి. దీనికి ముందు ఫిబ్రవరిలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను స్వల్పంగా రూ.7 చొప్పున తగ్గించగా, మార్చిలో రూ.6 పెంపును ప్రకటించాయి. అలాగే గత ఏడాది చివరిలో అంటే డిసెంబర్ మాసంలో సిలిండర్ రేట్లను రూ.62 పెంపును ప్రకటించాయి.

Also Read:-చెమటలు పట్టిస్తున్న గోల్ట్ రేట్లు.. ఇవాళ రూ.9వేల 300 అప్

ఇప్పటికే ద్రవ్యోల్బణం, మందగించిన వ్యాపారాలతో పాటు పెరిగిన ఇతర ఖర్చుల సమయంలో కమర్షియల్ గ్యాస్ వినియోగదారులు సతమతం అవుతుండగా స్వల్పంగా రేట్ల తగ్గింపు కొంత ఊరటను అందిస్తోంది. ఇదే క్రమంలో గృహ వినియోగదారులు ఉపయోగించే 14.5 కేజీల గ్యాస్ సిలిండర్ల రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగుతున్నాయి. అయితే గ్యాస్ ధరలు స్థానికంగా ఉండే ప్రభుత్వాలు విధించే టాక్సులు, ట్రాన్స్ పోర్టు ఖర్చులు వంటి వాటి కారణంగా స్వల్పంగా వ్యత్యాసాలను కలిగి ఉండటం సహజమే.