ఆయిల్ కు మనకు మధ్య అమెరికా

ఆసియా ఖండంలో చైనా డామినేషన్ కు ముకుతాడు వేయటానికి ఇండియాను పార్ట్నర్ గా చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే.. ఈ విషయంలో ట్రంప్ యంత్రాంగం మన దేశాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతోంది. చరిత్ర పరంగా చూసినా , భౌగోళిక పరంగా గమనించి నా చిన్న చిన్న అమెరికా మిత్ర దేశాలతో పోల్చితే ఇండియా పూర్తి భిన్నంగా ఉంటుంది. అగ్ర రాజ్యానికి, మన దేశానికి మధ్య ప్రస్తుతం సత్సం బంధాలు కొసాగుతున్న మాట నిజం. ఆ రిలేషన్ షిప్ ని సాకుగా చూపి వేరే దేశాలతో తలెత్తే ప్రతి గొడవలోకీ ఇండియాని లాగాలనుకోవటం అమెరికాకు సరికాదు. ప్రతి దేశమూ ఇతర దేశాలతో దోస్తీ చేయాలని ఆశిస్తుంది.

ఈ మేరకు తాను ఇండిపెండెంట్ గా ఉండాలని, బయటి దేశాల ఒత్తిళ్లు అడ్డు రాకూడదని కోరుకుంటుంది. అలాగే ఇండియా కూడా ఇరాన్ తో స్నేహంగా ఉండాలనుకుంటోంది. దీన్నొక విధానంగా ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. కాబట్టి ఈ విషయంలో అమెరికా ఫ్రెండ్స్ సర్కిల్ లోని దేశాలకూ, ఇండియాకీ చాలా తేడా ఉందని తెలుసుకోవాలి. యూరప్, లాటిన్ అమెరికా, ఆసియాలోని కొన్ని దేశాలకు అమెరికా ముఖ్యమైన సెక్యూ రిటీ ప్రొవైడర్. మనకు మాత్రం కాదు. పైపెచ్చు.. ఇండియానే పొరుగు దేశాలకు నెట్ సెక్యూ రిటీ ప్రొవైడర్ గా వ్యవహరిస్తోంది. దీనికోసం అగ్ర రాజ్యం నుం చి ఎకనమిక్ ఇన్వెస్టిమెం ట్లను, టెక్నా లజీ ఎక్స్​పర్టైజ్ ను; డిఫెన్స్​ ఎక్విప్ మెం ట్ సేల్స్, మాన్యుఫాక్చరింగ్ ను ఆహ్వానిస్తుంది.

ఈ నేపథ్యంలో మన దేశం ఇతర దేశాలతో వివిధ రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకుంటుం ది తప్ప అమెరికా ఆదేశాల ప్రకారం నడుచుకోదు. ఆ అవసరం కూడా లేదు. చైనా మాదిరిగానే ఇండియా కూడా ‘ప్రపంచంలో అత్యధిక ఇంధనాన్ ని ఇంపోర్ట్​ చేసుకునే టాప్ దేశాల్లో ’ ఒకటి. మన దేశ విదేశీ, వ్యూహాత్మక విధా నంలో ఎనర్జీ సెక్యూ రిటీ ఒక ప్రధాన అంశం. అందువల్ల ఇండియాకి ఆయిల్ సరఫరా చేసే దేశాల లిస్టు చాలా పెద్దగా ఉంటుం ది. అంతేకాదు. ఇరాన్ , గల్ఫ్ కంట్రీస్ మధ్య ఇండియా బ్యాలెన్స్​ మెయిం టైన్ చేస్తుంది. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతిపై అమెరికా​ ఆంక్షలు విధించడంతో మన దేశం ఇతర మార్గాలను ఆశ్రయిస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి ఇంపోర్ట్​లను పెంచుకుంటుంది.

గల్ఫ్ దేశాలకు అనుకూలం….

అమెరికా ఆటంకాలను సృష్టిస్తుం దని ఇండియా ముందే పసిగట్టి కొన్నేళ్లుగా ఇరాన్ ఆయిల్ పై ఆధారపడటం మానేసింది. 2018 ఫిబ్రవరి–2019 ఫిబ్రవరి మధ్య కా లంలో ఈ దిగుమతులు 60 శాతం తగ్గినట్లు ఒక అంచనా. ఇండియా లాగే ఇతర దేశాలు మరికొన్నాళ్లలో అమెరికా ఆంక్షలను తమకు అనుకూలంగా మలచుకోనున్నాయి. ముఖ్యం గా సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ ప్రొడక్షన్ పెం చనున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఇరాన్ ఇంధనం కొరత వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేస్తాయి.

ఇరాన్ కు వ్యూహాత్మక ప్రాధాన్యం…

అమెరికా ఇరాన్ ని ఎప్పుడూ ఇరాక్ , ఇజ్రాయెల్ కోణంలోనే చూస్తుం ది. ఇండియా మాత్రం ఆ దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఇస్తుం ది. ఇరాన్ కి, మన దేశానికి మధ్య ఒకప్పుడు చారిత్రకంగా, సాంస్కృతికంగా బలమైన సంబంధాలు ఉండేవి. ఆ రిలేషన్స్ ఇప్పుడు ఆయిల్, ఆఫ్గనిస్థాన్ వంటి అంశాల కే పరిమితమయ్యాయి. ఇండియా ఇరాన్ నుం చి ఇంధనం దిగుమతులను పూర్తిగా నిలిపేయ కపోవటానికి కారణం ఆ దేశం మీదుగా ఆఫ్గనిస్థాన్ లోకి, అటు నుంచి మధ్య ఆసియాలోకి రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉండటమే.

మన దేశం పాకిస్థాన్ మీదుగా ఆఫ్గనిస్థాన్ కి వెళ్లొచ్చు. కానీ దాయాది దేశం ఒప్పుకోవట్లేదు. దీంతో ఇరాన్ ద్వారానే ప్రవేశించాల్సి వస్తోంది. అక్కడి చాబహర్ పోర్ట్​ ద్వారా సెంట్ర ల్ ఏసియాలోకి ప్రవేశించడానికే ఇండియా ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తోంది. అందువల్ల దక్షిణ చైనా సముద్రం లో ఏం జరిగిందనే దాని కన్నా ఆఫ్గనిస్థాన్ లో ఏం జరిగిందనేదే మనకి ముఖ్యం. కాబట్టి ఇండో పసిఫిక్ లోని పసిఫిక్ పార్ట్​లో ఇండియా కీలక పాత్ర పోషించాలంటే అమెరికా మన దేశ ఆందోళనలను అర్థం చేసుకోవాలి.