డ్రైనేజీలో ఆయిల్కలిసి ఆ నీరు పొంగి పొర్లడంతో వాహనదారులు అదుపుతప్పిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేట చౌరస్తా నల్గొండ క్రాస్ రోడ్డులో మెయిన్‌రోడ్డుపై ఉన్న డ్రైనేజీ నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ఆ నీటిలో నూనె కలిసి ఉంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వరుస బెట్టి అదుపుతప్పి కింద పడ్డారు. దీనిని చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. వెంటనే బాధితులను పైకి లేపారు. అదుపుతప్పిన ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు.
ALSO READ :దేవుడా.. ప్రపంచంలోని అన్ని కుక్కలను కాపాడు : ఓ పిల్లోడి ప్రార్థన
భారీగా ట్రాఫిక్ జామ్..
ఈ ఘటనతో మరమ్మతులు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు చంచల్‌గూడ నుంచి చాదర్ఘాట్వెళ్లే దారిని మూసేయడంతో ట్రాఫిక్ ఏర్పడింది. రెండు గంటలుగా సహాయక చర్యలు చేపట్టినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో.. ట్రాఫిక్ ఏర్పడిందని వాహనదారులు చెబుతున్నారు. త్వరగా పనుల్ని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.