పెద్దపల్లి జిల్లాలో పెరిగిన ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు

పెద్దపల్లి జిల్లాలో పెరిగిన ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు
  • పెద్దపల్లి జిల్లాలో ఏడాదిన్నరలో 3వేల నుంచి 10వేల ఎకరాలకు..
  • జిల్లాలో ఇండస్ట్రీ ఏర్పాటు నిర్ణయంతో ఊపందుకున్న సాగు 
  • సబ్సిడీపై డ్రిప్ ​స్ప్రింక్లర్లు, సాగుపై రైతులకు శిక్షణ 
  • సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోత్సాహంతో రైతుల్లో ఆసక్తి 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు క్రమంగా పెరుగుతోంది. ఏడాదిలో 3వేల నుంచి 10 వేల ఎకరాలకు పెరిగింది. జిల్లాలో కాల్వశ్రీరాంపూర్​మండలం పెదరాత్‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామ పరిధిలో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేయడంతో రైతుల్లో ఆసక్తి పెరిగింది. దీంతోపాటు జిల్లా అధికారులు ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు పెంచాలని అవగాహన సదస్సులు పెట్టి రైతులను ప్రోత్సహిస్తున్నారు. సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్సిడీపై డ్రిప్‌‌‌‌‌‌‌‌ స్ర్పింక్లర్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో రైతులు ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగువైపు చూస్తున్నారు.  

ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుకు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోత్సాహం 

రాష్ట్రంతోపాటు దేశంలో నూనెల వాడకం పెరగడంతో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఆధ్వర్యంలో పెద్దకల్వల సమీపంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌ మొక్కల ఉత్పత్తికి నర్సరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ పెరిగిన మొక్కలను రైతులకు సబ్సిడీపై ఇస్తున్నారు. ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు చేసే రైతులకు సబ్సిడీపై డ్రిప్‌‌‌‌‌‌‌‌ స్ప్రింకర్లు అందజేస్తోంది. దీంతోపాటు సాగులో మెలకువలపై రైతులకు శిక్షణ ఇచ్చింది. సాగును పెంచేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఇటీవల కాల్వశ్రీరాంపూర్​ మండలంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ మరో ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. 

ఏటా 5వేల ఎకరాల సాగుకు ప్రణాళికలు 

పెద్దపల్లి జిల్లాలో ఏటా ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగు 5వేల ఎకరాలు పెరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా ఏడాదిన్నరలో 3 వేల నుంచి 10వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెంచగలిగారు. మొదటగా 1,211 ఎకరాల్లో సాగవగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు అందజేయడంతోపాటు సాగులో మెలకువలపై శిక్షణ ఇస్తోంది. డ్రిప్‌‌‌‌‌‌‌‌ స్ర్పింక్లర్లు అందజేస్తుండడంతో వాటర్ వేస్టేజ్‌‌‌‌‌‌‌‌ తగ్గింది. దీంతో రైతులు ఆయిల్​పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. 

హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేకంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మరోవైపు ఆయిల్​పామ్‌‌‌‌‌‌‌‌ తోటలో అంతర్‌‌‌‌‌‌‌‌ పంటలుగా కంది, పసుపు, నువ్వులు, వేరుశెనగ తదితర పంటలను సాగుచేసుకోవచ్చు.  దీంతోపాటు అదనపు ఆదాయం సమకూరనుంది. ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ మొక్కలు 4 నుంచి 5 ఏండ్ల వరకు క్రాప్‌‌‌‌‌‌‌‌నిస్తాయి. స్థానికంగా ఇండస్ట్రీ ఏర్పాటుతో పాటు ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్​ గెలలకు మద్దతు ధర దక్కుతుండడం రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది.