ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

ములకలపల్లి, వెలుగు: మండలంలోని ఆయిల్ పామ్ తోటలను గురువారం కేంద్ర బృందం సభ్యులు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి  కలిసి పరిశీలించారు. పొగళ్లపల్లి, తిమ్మంపేట గ్రామాల్లో విత్తన, జన్యు పరమైన లోపాలతో దిగుబడి ఇవ్వని ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. తిమ్మంపేటలో తాండ్ర వినోద్ రావు తోటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. శాస్త్రవేత్త బీఎన్ రావు తోటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. వీరితోపాటు సిబ్బంది  కొత్తగూడెం డివిజనల్ ఆఫీసర్ రాధాకృష్ణ, ఖమ్మం డివిజన్ల ఆఫీసర్లు రామకృష్ణ,  ప్రవీణ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఫార్మర్ సొసైటీ మెంబర్  ఉమా మహేశ్వర రెడ్డి, కృపాకరరావు పాల్గొన్నారు.

 సత్తుపల్లి మండల పరిధిలో..

సత్తుపల్లి: వింత వ్యాధితో పామాయిల్ మొక్కలు చనిపోతున్నాయన్న ఫిర్యాదు మేరకు టీఎస్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పలు తోటలను పరిశీలించారు. మండల పరిధిలోని నారాయణపురం, గౌరిగూడేం గ్రామాల్లో దెబ్బతిన్న తోటలను శాస్త్రవేత్త బీఎన్ రావు తో కలిసి సందర్శించారు. ఇక్కడి మొక్కలకు వైద్యం అవసరమని అందుకు సగం ఖర్చు ఆయిల్ ఫెడ్,  సగం రైతులు పెట్టుకోవాలని సూచించారు. పోషణ చేస్తే పామాయిల్ కి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఆయన వెంట డీఎం సుధాకర్ రెడ్డి, టెక్నికల్ కన్సల్టెంట్ ప్రవీణ్ రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం డీవోలు రామకృష్ణా రావు, రాధాకృష్ణ, రైతులు మహేశ్వర్ రెడ్డి, శ్రీను, దామోదర్ రెడ్డి, నాగలక్ష్మి ఉన్నారు.