- రష్యా‑ఉక్రెయిన్ యుద్ధంతో ఆగని ఆయిల్ పరుగు
న్యూఢిల్లీ: గ్లోబల్‌గా క్రూడాయిల్ రేట్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదరడంతో మార్కెట్‌లో ఆయిల్ కొరత పెరుగుతోంది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు శుక్రవారం 7 శాతం పెరిగి 118.11 డాలర్లకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 120 డాలర్ల లెవెల్‌ను క్రాస్ చేస్తుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని రెండు సిటీల నుంచి జనాలను ఖాళీ చేసుకోవడానికి రష్యా తన దాడులను కొంత టైమ్ వరకు ఆపిందని, తాజాగా తన దాడిని తిరిగి పెంచిందనే వార్తలొస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్‌లో రష్యా కీలకంగా ఉంటోంది. ఈ కంట్రీ రోజుకి 10 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. 4.7 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను ఎక్స్‌పోర్ట్ చేస్తోంది. యుద్ధం వలన రష్యా నుంచి మార్కెట్‌లోకి వచ్చే ఆయిల్ సప్లయ్ తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగ్గ క్రూడాయిల్ సప్లయ్ కాకపోవడంతో ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఒమన్ క్రూడ్, దుబాయ్ క్రూడ్, బ్రెంట్ క్రూడ్‌లతో కూడిన ఇండియన్ క్రూడ్ బాస్కెట్ వాల్యూ మార్చి 3 నాటికి బ్యారెల్‌కు 117.39 డాలర్లకు పెరిగినట్టు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ డేటా ద్వారా తెలుస్తోంది. దేశ ఆయిల్ అవసరాల్లో 85 శాతం వాటాను దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాం. పెరుగుతున్న క్రూడాయిల్ రేటు దేశ ఎకానమీపై నెగెటివ్ ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నా, లోకల్‌గా పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచడం లేదు. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని అంచనా. ఇంటర్నేషనల్‌గా క్రూడాయిల్ రేట్లను తగ్గించడానికి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎజెన్సీలోని దేశాలు తమ స్ట్రాటజిక్ నిల్వల నుంచి 61 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను మార్కెట్‌లోకి తెస్తామని ప్రకటించాయి. కానీ, ఇది మార్కెట్‌లోని కొరతను తగ్గించలేదని ఎనలిస్టులు చెబుతున్నారు.