
నూతన నటీనటులు బాలు, షిన్నోవా జంటగా బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించిన చిత్రం ‘ఒక బృందావనం’. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, కళ్యాణి రాజు, మహేంద్ర ముఖ్య పాత్రలు పోషించారు.
షూటింగ్ పూర్తి చేసుకుని, త్వరలోనే రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది.
వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా ఇస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టి ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. కొత్తదనం కోరుకునే ఆడియెన్స్‌కు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.